20071130

ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లు

ఆంధ్ర ప్రదేశ్లో సిటిజన్ ఛార్టర్లను ప్రకటించిన కొన్ని సంస్థలు :
  • ఎ.పి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
  • ఎ.పి. ఫైర్ సర్వీసెస్
  • ఎ.పి. ఇండస్ట్రియల్ డవలప్మెంట్ కార్పొరేషన్
  • ఎ.పి. ట్రాన్స్కో/ డిస్కమ్
  • ఎ.పి. హౌసింగ్ బోర్డు
  • ఎ.పి. హౌసింగ్ కార్పొరేషన్
  • ఎ.పి. హౌసింగ్ ఫెడరేషన్
  • ఎ.పి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
  • ఎ.పి. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
  • ఎ.పి. పోలీస్
  • ఎ.పి. రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ
  • ఎ.పి. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
  • బి.సి వెల్ఫేర్ డిపార్ట్మెంట్
  • బోర్డ్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
  • బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
  • బాయిలర్స్ డిపార్ట్మెంట్
  • ఛీఫ్ ఇంజనీర్స్, నేషనల్ హైవేస్
  • సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్
  • కమీషనరేట్ ఆఫ్ టెండర్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హజ్బెండరీ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ హాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ
  • డిపార్ట్మెంట్ ఆఫ్ స్మాల్ సేవింగ్స్, లాటరీస్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్
  • డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
  • ఇఎస్ఐ హాస్పటల్స్
  • గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్
  • జవహర్ బాల భవన్
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్
  • మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్
  • పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్
  • ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ డిపార్ట్మెంట్
  • స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
  • స్టేట్ ఆర్చివ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • తెలుగు అకాడమీ
  • డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్
  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (హోమియోపతి, ఆయుర్వేదిక్ హాస్పటల్స్)
  • దాదాపు జాతీయ బ్యాంకులన్నీ కూడా సిటిజన్ ఛార్టర్స్ను ప్రకటించాయి.

Labels:

20071129

యజమానులు కాదు - సేవకులు

సిటిజన్స్ ఛార్టర్
పౌరుల అధికార పత్రం

----గాలి ఉదయ కుమార్, కార్యదర్శి, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ, హైదరాబాద్
ఒకానొక ప్రభుత్వ కార్యాలయంలో ఒక చిన్న పని జరిగేందుకు 27 సంవత్సరాల ఆలస్యం జరిగిందంటే మీరు నమ్మగలరా? కాని ఇది నిజం. మద్రాస్ నివాసి లక్ష్మీ రాఘవాచారి తనకు అలాట్ అయిన ప్లాట్ పట్టాను ఇవ్వవలసిందిగా కోరుతూ 1965లో మైలాపూర్ తహసీల్దారుకు దరఖాస్తు పెట్టుకొన్నారు. 27 నిండు సంవత్సరాల పాటు ఆయనకు పట్టా లభించలేదు. సంబంధిత అధికారులకు ఆయన 101 ఉత్తరాలు వ్రాశారు. విసిగి వేసారి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసిన తర్వాత 1992లో ఆయనకు పట్టా లభించింది. ఒరిస్సాకు చెందిన చింతామణి మిశ్రా కొన్ని సర్టిఫైడ్ కాపీల కోసం తహశీల్దారు కార్యాలయంలో అవసరమైన ఫీజును చెల్లించారు. ఇక ఆ తర్వాత ఆయన బాధలు మొదలయ్యాయి. కార్యాలయం చుట్టూ 16 సార్లు ఆయన తిరగ వలసి వచ్చింది. తహశీల్దారునీ, సబ్ కలెక్టర్నీ, కలెక్టర్నీ కలిసినా ప్రయోజనం కనిపించలేదు. చివరకు ఫోరంను ఆయన ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవలసి వచ్చింది. ఇటువంటి సంఘటనలు ఒక్క ప్రభుత్వ సంస్థలకే పరిమితం కాదు. ప్రైవేట్ సంస్థల్లోను కోకొల్లలు.

సేవలను అందించే వారి అలసత్వం, నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా ఇటువంటి కష్ట నష్టాలకు మీరు ఎపుడైనా గురయ్యారా? సమస్య చిన్నదే కావచ్చు. వాటిల్లిన నష్టమూ పెద్దది కాకపోవచ్చు. రైల్వేలు, ఆర్టీసీ, బ్యాంకులు, టెలికామ్, విద్యుత్, పోస్ట్, కొరియర్ వంటి వివిధ సంస్థలు అందించే సేవల్లో లోపాలతో బాధ పడి, ఎందుకిలా అయ్యింది-మనం ఏమీ చేయలేమా అని నిస్సహాయంగా మానసిక క్షోభకు లోనయ్యారా?

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1998 డిసెంబర్ 12న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్ లేకుండా అయిదు లక్షల రూపాయలను చెల్లించాలని ఆయన భార్య దరఖాస్తు చేసుకొన్నారు. ఆరేళ్ల పాటు ఫైలు తిరిగింది. ఈ ఆరేళ్ల కాలంలో పెన్షన్ కూడా రాలేదు. దాంతో ఉద్యోగి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనక తప్పలేదు. 2004 డిసెంబర్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్గ్రేషియాను వెంటనే చెల్లించాలంటూ చేసిన ఆదేశాలను అమలు చేయలేదు. మళ్లీ రెండవ సారి ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవటంతో ఆ కుటుంబానికి పరిహారం అందింది. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన ఆరేళ్లకు, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగిన తర్వాత, ఆ కుటుంబానికి సాయం అందింది. అదీ ముఖ్యమంత్రి కార్యాలయం రెండు సార్లు జోక్యం చేసుకొన్నాక!
ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికే, ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఏ చదువూ లేని ఒక సామాన్యుడు, సన్నకారు రైతు, కూలి, ఒక చిన్న వ్యాపారికి... ప్రభుత్వ కార్యాలయాలతో పని పడితే... ఆ పని ఎంత కాలానికి పూర్తవుతుంది? అందుకు ఎంత ఖర్చవుతుంది? ఎన్ని ఇబ్బందులెదురవుతాయి? ఏ పని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పటం ఎవరికి సాధ్యం? ఈ ప్రశ్నలన్నిటికీ పరిష్కారాన్ని సూచించేదే 'సిటిజన్ ఛార్టర్'.

సిటిజన్ ఛార్టర్ కార్యక్రమం ప్రజాస్వామ్య సంస్కరణల్లో ఒక భాగం. వినియోగదారుడిని కేంద్రంగా చేసుకొని ప్రజానుకూల విధానాలతో ప్రజలకూ, ప్రభుత్వానికీ మధ్య భాగస్వామ్యాన్ని పెంచే ప్రక్రియ ఇది. ఇది ఒక భావన లేదా ఊహ కాదు. ఇది ఒక క్రియాశీలక కార్యక్రమం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన యజమానులైన పౌరులకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలను అందించేందుకు ఇది ఉత్తమమైన మార్గం.
'ఉత్తమమైన పాలన' లేదా 'సుపరిపాలన'ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశిస్తున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, అందుబాటు లేదా పౌరులతో సాన్నిహిత్యం - ఈ మూడూ సుపరిపాలనకు సంబంధించిన ముఖ్యాంశాలు. మేలైన ప్రజా సేవలను అందించాలంటూ దేశ ప్రజలు స్వాధికారంతో అడగటంతో మన దేశంలో సిటిజన్స్ ఛార్టర్ కార్యక్రమం ప్రారంభమైంది.
1991లో యునైటెడ్ కింగ్డమ్లో అప్పటి ప్రధాని జాన్ మేయర్ సిటిజన్స్ ఛార్టర్ కార్యక్రమాన్ని పది సంవత్సరాల జాతీయ కార్యక్రమంగా ప్రకటించారు. 1996లో సమీక్షానంతరం కార్యక్రమం పేరును 'సేవ ప్రధమం (సర్వీస్ ఫస్ట్)గా మార్చారు. ప్రపంచవ్యాప్తంగా సిటిజన్ ఛార్టర్లు చెప్పుకోదగిన రీతిలో ఆసక్తిని రేకెత్తించాయి. ఆస్ట్రేలియా, కెనడా, సంయుక్త రాష్ట్రాలు, బెల్జియం, సింగపూర్ల లోను యునైటెడ్ కింగ్డమ్ తరహాలోనే సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాలను చేపట్టారు.
మన దేశం విషయానికి వస్తే 'వినియోగదారుల సమన్వయ సమితి' తొలిసారిగా సిటిజన్ ఛార్టర్ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించింది. 1994లో జరిగిన కేంద్ర వినియోగదారుల రక్షణ సమితి సమావేశంలో వినియోగదారుల సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజోపయోగ సేవా సంస్థల సేవలను మెరుగు పరిచే విధానం గురించి ప్రశ్నించినపుడు కేంద్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఎ.కె.ఆంటోని ప్రతిస్పందిస్తూ తొలుత ఆరోగ్య సేవలతో సిటిజన్ ఛార్టర్ను రూపొందించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అదే సమావేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆగస్ట్ 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజా సేవలను మెరుగు పరిచేందుకు సిటిజన్ ఛార్టర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. 20 నవంబర్ 1996న ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శుల సమావేశం ప్రధాని ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిటిజన్ ఛార్టర్లకు సంబంధించి కొన్ని సిఫార్సులను చేసింది. అన్ని స్థాయిల్లో పరిపాలన వ్యవస్థ సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, స్వచ్ఛంగా, ఏ అరమరికలు లేకుండా ప్రజావాక్యానికి ప్రతిస్పందించే విధంగా ఉంటుందని ప్రజలకు స్పష్టం చేయవలసిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. మరింత ఆలస్యం కాకముందే ప్రస్తుత స్థితిగతులను సంస్కరించాలని కార్యదర్శుల సమావేశం స్పష్టం చేసింది. పక్షపాతం, ఆలస్యం, లంచగొండితనం, నిర్దయ, ఉదాసీనత - ఇలా ప్రజా సేవలనగానే ప్రజలలో తలెత్తే వ్యతిరేక భావనలను మార్చవలసిన అవసరాన్ని సమావేశం గుర్తించింది. ప్రజా పాలనా వ్యవస్థ సమర్థత, యుక్తియుక్తాలను గురించి ప్రజల్లో, ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించవలసి ఉంది. పారదర్శకమైన, బాధ్యతాయుతమైన ప్రజా సేవలు, వాటి ప్రక్షాళన ఒకదానితో ఒకటి ముడిపడివున్న అంశాలు. వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొన్నపుడే స్వచ్ఛంగా ప్రతిస్పందించే పరిపాలన సాధ్యమౌతుంది.
ప్రభుత్వ, ప్రజా సంస్థల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంపొందించటంతో పాటు, కార్యకలాపాలకు సంబంధించి ఏ రహస్యమూ లేని బహిరంగ ధోరణిని అవలంబించ వలసిన అవసరం ఉంది. సేవలను పొందే ప్రజల సంతృప్తి మేరకు విస్తృతమైన పరిధిలో బాధ్యతాయుతమైన సేవలకు వివరణ ఇవ్వాలి. వీలైనన్ని ఎక్కువ సేవా సంస్థల్లో సిటిజన్ ఛార్టర్లను ప్రవేశపెట్టటంతో పాటు వాటి అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి.

సిటిజన్ ఛార్టర్ లోని ప్రధానాంశాలు:
  • ప్రతి ఒక్క ప్రజా సేవలోను ఉత్తమమైన నాణ్యత
  • 'ఎంపిక'లో ప్రజలకు మరింత అవకాశం
  • ఏ తరహా సేవను ఆశించవచ్చో ప్రజలకు తెలియజెప్పటం
  • సేవాలోపం ఉన్నపుడు ఏం చేయాలో ప్రజలకు తెలిసేలా చూడటం

సిటిజన్ ఛార్టర్ లోని ఆరు ప్రధానమైన సూత్రాలు:
  1. ప్రచురితమైన ప్రమాణాలు
  2. సమాచారము, బహిరంగ ధోరణి
  3. ఎంపిక, సంప్రదింపులు
  4. మర్యాదాపూర్వకమైన, సహాయం అందించే ధోరణి
  5. సేవా లోపాలకు సంబంధించి నివృత్తి
  6. డబ్బుకు తగిన విలువ

సిటిజన్ ఛార్టర్ లోని ఆరు ప్రధానమైన సూత్రాల గురించి ఇపుడు విపులంగా పరిశీలిద్దాం.
ప్రమాణాలు : స్పష్టమైన ప్రమాణాలను పేర్కొనటంతో పాటు వాటిని ప్రచురించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో ఈ ప్రమాణాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. పని పూర్తయ్యేందుకు అవసరమయ్యే కనిష్ట, గరిష్ట కాల పరిమితిని ప్రమాణాల్లో పేర్కొనాలి.
సమాచారము, బహిరంగ ధోరణి: ప్రజా సేవల నిర్వహణ, అందుకు అయ్యే ఖర్చు, సంబంధిత అధికారి ఎవరు? వంటి వివరాలతో కూడిన సంపూర్ణమైన, వాస్తవిక సమాచారం సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా చూడాలి.
ఎంపిక, సంప్రదింపులు : సేవలను వినియోగించుకొనే వారితో క్రమానుగుణ సంప్రదింపులు జరిపే అవకాశం కల్పించాలి. సేవలకు సంబంధించి వినియోగదారుల ప్రాధాన్యతలు, సేవల మెరుగుకు చేపట్టవలసిన చర్యల విషయమై వినియోగదారులు వ్యక్తం చేసే అభిప్రాయాలను తెలుసుకోవాలి.
మర్యాదాపూర్వకమైన, సహాయం అందించే ధోరణి : ప్రభుత్వ సిబ్బంది మర్యాదాపూర్వకంగా సేవలను అందించాలి. వారిని గుర్తించేందుకు అనువుగా సిబ్బంది తమ పేరును, హోదాను సూచించే బ్యాడ్జీలను ధరించాలి.
సేవా లోపాలకు సంబంధించి నివృత్తి : ఏదైనా సేవను అందించటంలో పొరపాటు జరిగినపుడు క్షమాపణ తెలియజేయాలి. సేవాలోపం ఎందుకు జరిగిందో తెలిపే కారణాలతో పూర్తి వివరణను ఇవ్వాలి. సమర్థవంతమైన నివృత్తిని సూచించాలి.
డబ్బుకు తగిన విలువ: ప్రజలు తాము చెల్లించే డబ్బుకు తగిన విలువైన సేవలను పొందటం సాధ్యం కావాలి. పన్నుల రాబడి నుంచి పరిపాలన నిమిత్తం వ్యయం చేసే మొత్తాన్ని, పౌరులకు అందే సేవల విలువలను పోల్చి చూసినపుడు డబ్బుకు తగిన విలువ లభించాలి.
ఛార్టర్ మార్క్ : యునైటెడ్ కింగ్డమ్లో విశిష్టమైన, వినూత్నమైన రీతిలో ప్రజా సేవలను అందించే వారిని 'ఛార్టర్ మార్క్ అవార్డు స్కీమ్' గుర్తించి సత్కరిస్తుంది. విశిష్టమైన సేవలు ఏవో సూచించటం ద్వారా ప్రజలు కూడా ఛార్టర్ మార్క్ స్కీమ్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు.

సిటిజన్ ఛార్టర్ల ద్వారా ఏమి సాధించవచ్చు?
  • మానవ వనరుల నిర్వహణలో అభివృద్ధి
  • సిబ్బందిలో కార్యదక్షత పెంపు
  • ప్రజలకు అధికారం
  • జవాబుదారీతనం పెరగటం
  • డబ్బుకు తగిన విలువ
  • తక్కువ సమయంలో పనులు పూర్తి కావటం
  • సిటిజన్ ఛార్టర్ విజయానికి దారి తీసే కారణాలు:
  • సిబ్బంది అందరిలో సిటిజన్ ఛార్టర్ అత్యవసరమనే భావన
  • ఛార్టర్ సూత్రాల పట్ల నిబద్ధత
  • ఛార్టర్ అమలులో ప్రగతిని పర్యవేక్షించటం
  • వ్యక్తిగత పౌరులు, వినియోగదారుల సంఘాలు, ప్రజా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు
  • సంస్కరణ చర్యలను చేపట్టటం
  • పరిపాలన వికేంద్రీకరణ
  • నియమాలు, విధానాల సరళీకరణ
  • ఫిర్యాదు పరిష్కార వ్యవస్థల అభివృద్ధి

ఫిర్యాదుకు నిర్వచనం ఏమిటి?
ప్రతిస్పందనను కోరుతూ వ్యక్తం చేసే ఏ అసంతృప్తికరమైన భావననైనా ఫిర్యాదు అనవచ్చు. ఫిర్యాదులను, ఫిర్యాదు చేసేవారిని ప్రతికూల ధోరణితో చూడటం ఏ కార్యాలయంలో నైనా మనం సాధారణంగా చూసేదే. వాస్తవానికి ఫిర్యాదులు సేవను మెరుగు పరుచుకొనేందుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయి. తమ సేవలను ఏ విధంగా మెరుగు పరుచుకోవచ్చో తెలిపే సదవకాశాలుగా పిర్యాదులను చూసేట్లు సిటిజన్ ఛార్టర్ ప్రజా సేవా సంస్థలను ప్రోత్సహిస్తుంది. ప్రతి సేవా సంస్థ తమ దైన బాణీలో ఫిర్యాదును నిర్వచించటంతో పాటు , దానిని తామందించే అన్ని సేవలకూ వర్తింపజేయాలి. విధానాల రూపకల్పన చేసినంత మాత్రాన ఫిర్యాదుల వ్యవస్థ సమర్థవంతంగా ఉంటుందని భావించటానికి వీలు లేదు. ఫిర్యాదుల పట్ల సిబ్బంది వైఖరి ముందు మారాలి.
వ్యక్తులను విమర్శిస్తూ ఫిర్యాదులను చేసే నిందాపూర్వక సంస్కృతి వల్ల సిబ్బందిలో ఫిర్యాదులంటే ఒక భయం కలుగుతుంది. దాంతో వారు ఫిర్యాదులను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఫిర్యాదులు చేసేందుకు ఎవరైనా వచ్చినపుడు కోపం, వ్యతిరేక భావనలను ప్రదర్శిస్తూ ప్రతికూల వైఖరితో వ్యవహరిస్తారు. కనుక సేవలు లేదా వ్యవస్థ లోని లోపాలను గుర్తించే సదవకాశాన్ని కల్పించేవిగా ఫిర్యాదులను చూసే వాతావరణాన్ని ప్రతి సంస్థా కల్పించాలి. ఫిర్యాదుల పరిష్కరణా విధానాలు తమకూ అనుకూలమైనవేననే భావనను సిబ్బందిలో కలిగించాలి. ప్రజల దృష్టి కోణం నుంచి సమస్యను చూసి అర్థం చేసుకొనే తత్వాన్ని సిబ్బందికి అలవాటు చేయాలి. ఫిర్యాదుల పరిష్కరణ విధానాలను క్రమశిక్షణా చర్యల నుంచి వేరు చేయాలి.

సమర్థవంతమైన ఫిర్యాదుల వ్యవస్థ ప్రాధమిక సూత్రాలు:
  • ఫిర్యాదుల వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలి. పిర్యాదుల వ్యవస్థ గురించి అందరికీ తెలిసేలా తగిన ప్రచారం చేయాలి.
  • ఫిర్యాదుల వ్యవస్థ అర్థం చేసుకొనేందుకు, ఉపయోగించేందుకు సులువుగా ఉండాలి.
  • నిర్థారిత కాల పరిమితితో త్వరితంగా సమస్యా పరిష్కారం జరగాలి. ఫిర్యాదు ప్రగతి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందాలి.
  • నిష్పక్షపాత ధోరణిలో, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి.
  • అవసరమైనపుడు ఫిర్యాదీల వివరాలను రహస్యంగా ఉంచాలి.
  • ఉన్నతాధికారులకు తగిన రీతిలో సమాచారాన్ని అందజేయటం ద్వారా సేవల అభివృద్ధికి పాటు పడాలి.
  • ఆదర్శవంతమైన ఫిర్యాదుల వ్యవస్థ 'ఎలా ఫిర్యాదు చేయాలో' ప్రజలకు తెలిసేలా చేయటమే కాక ఫిర్యాదు చేయటం వలన ఫలితం కూడా ఉంటుందని తెలుసుకొనేలా చేస్తుంది.

ఫిర్యాదుల పరిష్కరణ :
ఫిర్యాదులను స్వీకరించినట్లు అక్నాలెడ్జ్మెంట్ను ప్రతి శాఖ ఇవ్వాలి. ఫిర్యాదుల పరిష్కరణకు ఎంతకాలం పడుతుందో ముందుగా ఫిర్యాదీకి తెలియజేయాలి. పేర్కొన్న కాల పరిమితిలోగా సమస్యను పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ ఫిర్యాదీకి సమాచారం అందించాలి. ఫిర్యాదు చేయటం ద్వారా ఏమి ఆశించవచ్చు? సమస్య ఏ మేరకు పరిష్కారం అవుతుంది? అనే వివరాలను ముందుగానే ఫిర్యాదీకి తెలియజెప్పాలి.
తాము చేసే ఫిర్యాదులను సేవా సంస్థ సిబ్బంది సావధానంగా విని పరిష్కరిస్తారనే నమ్మకం కుదిరినపుడే ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తారు. ఫిర్యాదు చేసినా ఏ ఫలితమూ ఉండదని భావించినపుడు ఎవరూ ఫిర్యాదు చేయరు. కనుక ప్రతి సేవా సంస్థా ఫిర్యాదులకు సదా స్వాగతం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని, అవసరమైనప్పుడు నివృత్తి అందుతుందని, ఫిర్యాదుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సేవల నాణ్యత మెరుగుకు కృషి జరుగుతుందని ప్రజల్లో నమ్మకం కలిగించాలి.
ప్రభుత్వ శాఖ తమను ఒంటరి వాళ్లను చేసి వేధిస్తుందని, ఫిర్యాదు చేసినందుకు శిక్షిస్తుందనే భయం ప్రజల్లో కలిగితే ఫిర్యాదుల దాఖలుకు ఎవరూ ముందుకు రారు. వినియోగదారుడికీ, సేవా సంస్థకూ మధ్య సంబంధం సున్నితమైనది గానూ, దుర్బలమైనది గానూ ఉన్నపుడు ఇది మరీ కష్టం.

ప్రభుత్వ సిబ్బంది - చిన్న గుమస్తా కావచ్చు, లేదా పెద్ద అధికారి కావచ్చు. వీళ్లు అందరూ ప్రజలకు సేవకులు - ఎవరూ యజమానులు కాదు. దే ఆర్ నాట్ మాస్టర్స్ దే ఆర్ సర్వెంట్స్

Labels:

20071128

త్వరలో జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ

పొగాకు నిరోధక చట్టాన్ని అమలుచేసేందుకు 'జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ'ను ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్‌ లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు కావూరి సాంబశివరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల పరిసరాల్లో పొగతాగడంపై నిషేధం, 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా చూడటం వంటి అంశాలు ఈ సంస్థ పరిధిలోకి వస్తాయన్నారు. బీడీ, సిగరెట్‌ పెట్టెలపై చట్టబద్ధమైన హెచ్చరికల ముద్రణ, వాటిల్లో తార్‌, నికోటిన్‌ ఏస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారో లేదో కూడా పరిశీలిస్తుందన్నారు.

Labels: ,

20071126

2008 డిసెంబర్ నాటికి 22 జిల్లాల్లో ' ఆరోగ్యశ్రీ'

2008 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని 22 జిల్లాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సంబాని చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా వైరాలో విలేకరుల సమావేశంలో  వెల్లడించారు.  పేదలకు నాణ్యమైన కార్పొరేట్‌స్థాయి వైద్యాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఆసియాలోనే మొట్టమొదటిగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు.

Labels: ,

విమానం రద్దుకు పరిహారం చెల్లించాలి

నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా రైళ్ళు, బస్సులు, విమానాలు బయ లుదేరడం, ముందస్తు సమాచారం లేకుండానే హఠాత్తుగా రద్దవడం, ఇవన్నీ తరచుగా ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యలే. ఎప్పుడు బయలు దేరుతుందో తెలియక, అసలు సర్వీసు ఉందో, రద్ద యిందో సమాచారంలేక గంటల తరబడి ఎదురుచూస్తూ ప్రయాణికులకు  కలిగే చికాకు, ఆందోళన, ఆవేదన అంతా ఇంతా కాదు. ఇలా బాధ్యతా రా హిత్యంగా ప్రవర్తిస్తున్న రవాణా సంస్థలపై వినియోగదారుల కోర్టులలో ఎన్నోసార్లు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు కూడా ఇటువంటిదే. సాంకేతిక కారణాల రీత్యా విమానాలను రద్దుచేసిన విమానయాన సంస్థలు ప్రయాణికులందరికీ 15,000 రూపాలయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. యోగేష్ కుమార్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది.

Labels:

స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రారంభం

ఢిల్లీ ప్రభుత్వం స్మార్ట్ కార్డు ప్రాజెక్టును ప్రారంభించింది. 16 కేబి స్మార్టు కార్డు ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్‌లు ఢిల్లీ  లోని ఒక జోనల్ కార్యాలయం నుండి జారీ అవుతున్నాయి. దశలవారీగా ప్రాజెక్టు తక్కిన జోన్లలో కూడా అమలవుతుంది. స్మార్టు కార్డుకు  నకిలీ కార్డును సృష్టించడానికి వీలు కాదు. ఎలక్ట్రానిక్ చిప్ కార్డు డ్రైవరు చేసిన తప్పులను, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ సమాచారాన్ని, కార్డు కలిగి ఉన్న వ్యక్తి జీవిత భీమా వివరాలను భద్రపరుస్తుంది. ఢిల్లీలో ఏటా 3.5 లక్షల లైసెన్స్‌లు జారీ అవుతున్నాయి.

Labels:

20071125

పౌర హక్కులపై విద్యార్థులకు పోటీలు

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా పౌర హక్కులపై విద్యార్థులకు పోటీలు నిర్వహించింది. వ్యవసాయ ఉత్పత్తులపై ఆగ్ మార్క్ నాణ్యతా చిహ్నాన్ని ఈ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ సంస్థ ఇచ్చే విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గాలి ఉదయ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఉదయ కుమార్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇనస్పెక్షన్ అధికారి మోహన్ నాయుడు స్వాగతోపన్యాసం చేశారు.

Labels:

వినియోగదారుల సంఘాలకు శిక్షణ

ఆంధ్ర ప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమాఖ్య ఇటీవల వినియోగదారుల సంఘాల నిర్వాహకుల కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి కాసు వెంకట క్ర్రిష్ణారెడ్ది, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గాలి ఉదయ కుమార్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంచాలకుడు శర్మ, కాప్కో గౌరీశంకర్, నాగేశ్వ్రర రావ్ తదితరులు పాల్గొన్నారు.

Labels: ,

20071124

తప్పుడు సమాచారంతో పొందిన బీమా క్లెయిమ్స్

మోసంతో కాని, తప్పుడు సమాచారంతో కాని పొందిన బీమా పోలసీ క్లెయిమును చెల్లించకుండా బీమా కంపెనీ తిరస్కరించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తప్పుడు సమాచార విషయం రుజువైన పక్షంలో అసలు పోలసీనే రద్దుచేయవచ్చునని జస్టిస్ ఎస్బీ సిన్హా, జస్టిస్ హెచ్ఎస్ బేడీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కేరళకు చెందిన చాకోచాన్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన కుటుంబీకులు ఎల్ఐసీ పాలసి క్లెయిము చేశారు. పాలసీ తీసుకున్న ఆరునెలలకే ఆయన మరణించారు. తనకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగిందన్న విషయాన్ని పాలసీ తీసుకున్న సమయంలో ఆ ఇంటియజమాని దాచి పెట్టారని, దరఖాస్తులో దానికి సంబంధించిన చోట 'నో' అని పేర్కొని తప్పుదోవ పట్టించారని క్లెయిమును ఎల్ఐసీ తిరస్కరించడంతో వివాదమైంది. కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం పాలసీదారు కుటుంబానికి అనుకూలంగా, అప్పీలులో బహుళసభ్య ధర్మాసనం ఎల్ఐసీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఇప్పుడు సుప్రీం.. హైకోర్టు డివిజన్‌బెంచి తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వు జారీచేసింది.

Labels: ,

ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్ ప్రయోగం విఫలం

దేశీయంగా తయారుచేస్తున్న ఎయిడ్స్ నిరోధక వ్యాక్సిన్(టీకా) తొలి దశ ప్రయోగాలు విఫలమయ్యాయి. దేశంలోనే ప్రప్రథమంగా రెండేళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించిన పుణేలోని నేషనల్ ఎయిడ్స్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఎఆర్ఐ) శాస్త్రవేత్తలు రూపొందించిన ఎయిడ్స్ వ్యాక్సిన్‌ పరీక్షల్లో విఫలమైంది. మొదటిదశ పరీక్షల్లో భాగంగా 2005లో 30 మందిపై అడెనో అసోసియేటెడ్ వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ ప్రయోగించి చూశారు. కానీ వారిలో 80 శాతం మందిలో వ్యాక్సిన్ ప్రభావం చూపించలేకపోయింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో వెంటనే రోగనిరోధక శక్తి ఆశించినంతగా పెరగలేదు.. అందువల్ల ఈ వ్యాక్సిన్ రెండోదశ ప్రయోగాలకు వెళ్లదలుచుకోవడం లేదని ఎన్ఎఆర్ఐ డైరెక్టర్ రమేష్ పరంజపే తెలిపారు. వ్యాక్సిన్‌ను మూడుదశల్లో ప్రయోగించాలని శాస్త్రవేత్తలు మొదటగా భావించారు. మొదటిదశలో 30మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించి, పనితీరును అధ్యయనం చేశారు. మొదటిదశ ఫలితాలు సంతృప్తికరంగా వస్తే , రెండోదశలో 500 మందిపై మూడోదశలో వేలాదిమందిపై పరీక్షించి చూడాలని భావించారు. ఇదీ విజయవంతం అయితే వేలాది మందిపై ప్రయోగించి టీకా ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ తొలి దశలోనే టీకా అంతగా ప్రభావం చూపలేదు.

Labels: , ,

ప్రపంచంలో 3.7 కోట్ల మంది అంధులు

ప్రపంచంలో మొత్తం 3.7 కోట్ల మంది అంధులున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వారిలో 67 లక్షల మంది ఒక్క భారత్‌లోనే ఉన్నారని, అంటే ప్రతి ఐదుగురు అంధుల్లో ఒకరు భారతీయులని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2001-02లో దేశంలో అంధుల సంఖ్య మొత్తం జనాభాలో 1.1 శాతం ఉండగా 2006-07 నాటికి 1 శాతానికి తగ్గింది. 2020 నాటికి 0.3 శాతానికి అంధుల సంఖ్యను తగ్గించాలని జాతీయ అంధత్వ నివారణ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లోని నేత్ర నిధి కేంద్రాల జాతీయ సంఘం లెక్కల ప్రకారం మన దేశంలో 500 నేత్ర నిధి, నేత్రదాన కేంద్రాలు ప్రతి ఏటా 30వేల కళ్లను సేకరిస్తున్నాయి.

Labels:

20071123

వికలాంగులకు రుణాలపై రాయితీ పెంపు

వికలాంగ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో సమానంగా ఉపకారవేతనాలు, ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23వ తేదీన మహిళా, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఏపీ డైరీలపై ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమీక్ష జరిపిన అనంతరం మంత్రి రాజ్యలక్ష్మి వికలాంగులు పొందే రుణాలపై రాయితీని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్‌ల ద్వారా ఇచ్చే రుణాలపై రూ.10వేల వరకూ రాయితీ ఇస్తుండగా... వికలాంగుల కార్పోరేషన్ అందించే రుణాలపై రూ.3వేలు మాత్రమే రాయితీ కల్పిస్తున్నారు.

Labels: ,

20071121

భారతదేశంలో తగ్గుతున్న ఎయిడ్స్

భారతదేశంలో హెచ్ఐవీ/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గింది.  దేశంలో ఎయిడ్స్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా లెక్కల్లో తేలింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎయిడ్స్ నియం త్రణ విధానం ఫలితాలనిస్తోందని, ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగ భారతదేశ సమన్వయ కర్త డెనిస్ బ్రౌన్ చెప్పారు. సమితి అంచనా ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 25లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో ఎయిడ్స్ కేసులు తగ్గగా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెరిగాయి.  అంచనా వేసిన దానికన్నా ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ కేసు లు ఏడు మిలియన్లు తగ్గాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఎయిడ్స్ రోగుల సంఖ్య 39.5 మిలియన్లకు చేరుకుంటుందని తెలిపారు.

Labels: , ,

శంకర ఐ ఫౌండేషన్‌కు విరాళం

కాలిఫోర్నియా: శంకర నేత్రాలయ ఫౌండేషన్‌కు నిధుల సేకరణార్థం ఇండియన్ క్లబ్ శాన్ మాటోలోని హైస్కూల్‌లో  'ఇండియన్ కలర్స్' పేరుతో సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన  11,037 డాలర్ల మొత్తాన్ని ఇండియన్ క్లబ్ అధ్యక్షురాలు సింధూరి గొల్లమూడి  శంకర నేత్రాలయ ఫౌండేషన్ చైర్మన్ మురళీ కృష్ణమూర్తి కి అందజేశారు.

Labels:

యువకళాకారులకు ఉపకార వేతనాలు

యువ కళాకారులు 2008-09 సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంస్కృతిక వ్యవహారాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో కోరారు. 10-14 సం|| మధ్య వయస్సు ఉండి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, నృత్యం, నృత్యరూపకం, నాటకం, జానపద కళల్లో అభిరుచి ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలు పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 20వ తేదీలోగా దరఖాస్తులను సంచాలకులు, సాంస్కృతిక శాఖ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ అనే చిరునామాకు పంపించాలి. పూర్తి వివరాలను www.ccrtindia.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

Labels: ,

20071115

చిట్‌ఫండ్ సవరణ బిల్లు ఆమోదం

1971 నాటి చిట్‌ఫండ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.  చిట్‌ఫండ్ కేసులను సివిల్ కోర్టుల పరిధి నుంచి తీసివేసి రిజిస్ట్రార్‌లకు బదలాయించడం ఈ సవరణ లలో ఒకటి. చిన్నమొత్తాల్లో చిట్‌లు కట్టేవారిని రక్షించడం కోసమే చట్టంలో సవరణలు తెస్తున్నామని మంత్రి రత్నాకరరావు అన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని  నిబంధనలను తీసుకునే సవరణలు చేశామని, తాము కొత్తగా ఏమీచేయలేదని చెప్పారు. దీని ప్రకారం ఇక నుంచి లక్ష రూపాయల చిట్‌కు 50 శాతం డ్రాఫ్టు రూపంలో, మిగిలిన 50 శాతం బ్యాంకు నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  కోర్టుల్లో మూడు వేల చిట్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు అధికారులను నియమిస్తున్నామని, శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు.

Labels: ,

20071107

పత్రికా చట్టంలో మార్పులు రానున్నాయా?

ఇపుడు అమలులో వున్న ప్రెస్, పుస్తకాల రిజిస్ట్రేషన్ (పిఆర్‌బి) యాక్ట్ 140 సంవత్సరాల కిందటిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో  వెలువడుతున్న ఆన్‌లైన్ న్యూస్ పోర్ట ల్‌లు, పత్రికల వెబ్ ఎడిషన్లను కూడా పత్రికా  చట్టం పరిధిలోకి తేవాలని ప్రభుత్వంయోచిస్తున్నది. వీటితోపాటు ప్రత్యేకంగా వార్తల ప్రసా రానికే ఏర్పాటు చేసిన టీవీ చానల్‌లు  కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చట్టంలోని ముద్రణ, వార్తాపత్రిక వంటి సంబంధిత పదాలను సవ రించాలనీ, పునర్ నిర్వచించాలని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ఇదే జరిగితే బ్లాగర్లు కూడా ఇక ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా లైసెన్సు తీసుకోవాల్సి వస్తుందేమో..

Labels: ,

20071106

వి.ఎస్.ఎస్.లతో గిరిజన కుటుంబాలకు లబ్ధి

విశాఖపట్నం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల గిరిపుత్రుల జీవన పరిస్థితులు మెరుగవుతున్నాయని రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఆర్.ఎ.పి) డి.కె.ఝా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో మొత్తం 5డివిజన్లలో 'వన సంరక్షణ సమితి సభ్యుల పునరావాస పథకం' అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటైన స్వతంత్ర సభ్యుల పర్యవేక్షక సంఘం సమీక్ష ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఝా మాట్లాడుతూ 5 అటవీ డివిజన్లలో చాలా మంది ఆదివాసీలు, గిరిజనులు పోడు వ్యవసాయం మాని, వన సంరక్షణ సంఘాలుగా ఏర్పడ్డారని, వాళ్లందరికీ ప్రభుత్వం పునరావాసం కల్పించేందుకు సాయం చేస్తోందని వివరించారు. పోడు భూమిని అప్పగించిన ప్రజలకు నష్ట పరిహారం ఇచ్చేలా 2000 నుంచి జె.ఎఫ్.ఎం. రెండో దశ (రీసెటిల్‌మెంట్ యాక్షన్ ప్లాన్- ఆర్.ఎ.పి) అమలు చేస్తున్నారు. మొత్తం రూ. 28 కోట్ల అంచనాతో ప్రారంభించిన ఈ పథకంలో ఇప్పటికి రూ. 7 కోట్లు ఖర్చు చేసి, 434 గ్రామాల్లోని 11,600 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు ఝా తెలిపారు. ఈ ఆర్.ఎ.పి. అమలు తీరును పర్యవేక్షించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులు సభ్యులుగా ఒక 'స్వతంత్ర సలహా బృందం'(ఇండిపెండెంట్ అడ్వైజరీ గ్రూప్- ఐ.ఎ.జి)ను ప్రభుత్వం నియమించింది.

Labels: , ,

చట్టపరిధిలోకి మొబైల్ ఫోన్ టవర్లు

మొబైల్ ఫోన్ టవర్లు హానికరమైన ఎలక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్‌ను వెలువరిస్తుండటంతో వాటిని క్రమబద్ధీకరిస్తూ చట్టాన్ని రూపొందించమని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. సెల్యులార్ సర్వీసు ప్రొవైడర్లకు చెందిన 3,000 టవర్లు నగరంలో ఉన్నాయి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు టవర్ల స్థాపన జరుగుతూనే ఉంది. టవర్ల నుండి వెలువడే రేడియేషన్ స్థాయి డేటాపై ఖచ్చితమైన ప్రమాణాలు ఇప్పటి వరకు లేవు. దీనికి సంబంధించి ఎటువంటి చట్టం లేకపోవడంతో ప్రభుత్వం ఏ రకమైన చర్యా తీసుకోలేక పోతోంది.

Labels: , , ,

కొనసాగుతున్న 'దేవదాసీ' వ్యవస్థ

13 ఏళ్ళ దళిత బాలిక 'దేవదాసీ' కావడానికి కొద్ది సమయానికి ముందు చెన్నయ్ అధికారులు జోక్యం చేసుకుని ఆ ఉచ్చు నుంచి బయట పడేశారు. తమిళనాడు గ్రామాల్లో అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ లేనే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. విల్లుపురం జిల్లాలోని గ్రామంలో కృష్ణవేణి అనే ఈ 13 ఏళ్ళ దళిత బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. గ్రామంలోని ఆలయంలో తండ్రి, గ్రామపెద్ద, పూజారి సమక్షంలో దేవదాసిని చేస్తున్న సమాచారం అందుకున్న వెంటనే అధికారులతో పాటు అక్కడకు చేరుకున్న పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ కుటుంబంలో మూడు తరాలుగా దేవదాసీ తంతు జరుగుతున్నట్లు తెలియవచ్చింది. గ్రామాల్లో ఇప్పటికీ ఈ ఆచారం వుందా అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Labels: ,

జీతం కోసం నాలుగేళ్ల పాటు ఎదురు చూపులు

తుది వేతన పత్రాన్ని (ఎల్‌పీసీ) అందజేయకుండా మహిళా ఉద్యోగిని నాలుగేళ్ల పాటు ఇబ్బందులకు గురి చేసిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ మానవహక్కుల కమిషన్ చొరవతో దిగివచ్చారు. సీల్డ్‌కవర్‌లో ఎల్‌పీసీని కమిషన్ ఛైర్మన్‌కు అందజేయటంతో వేతనం తీసుకునేందుకు ఆమెకు అడ్డంకి తొలగినట్లైంది.

డైరెక్టర్ గణాంకాల విభాగంలో డివిజనల్ అకౌంట్స్ అధికారి (డీఏఓ)గా పనిచేస్తున్న కె.శైలజ డిప్యూటేషన్‌పై 2000 సంత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డీఏఓగా విధుల్లోకి చేరింది. 2003 లో ఆమెను మాతృసంస్థకు పంపుతూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. శైలజకు ఎల్‌పీసీ ఇవ్వకుండా ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. తుది వేతన పత్రం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాకపోవడం తో ఆమె జీతం తీసుకునేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యా యి. పలుమార్లు తనకు ఎల్‌పీసీ ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను కోరినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఆమె ఔటర్ రింగ్‌రో డ్డు ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెం ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. మాతృసంస్థ నుంచి అనేకమార్లు ఎల్‌పీసీ పంపాలని కోరినా రిజిస్ట్రార్ స్పందించకపోవడంతో శైలజ గత ఆగస్టు 22న మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నవంబర్ ఒకటో తేదీలోగా ఓపెన్‌కోర్టుకు హాజరై నివేదిక ఇవ్వాల్సిందిగా రిజిస్ట్రార్‌ను కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఆదేశించారు. కోర్టుకు హాజరైన రిజిస్ట్రార్ ఆమె బదిలీ అవుతూ బాధ్యతలు అప్పగించలేదని కమిషన్ దృష్టికి తెచ్చారు. రిజిస్ట్రారే స్వయంగా ఆమెను మాతృసంస్థకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన విషయంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయగా, అదే రోజు మధ్యాహ్నం శైలజ ఎల్‌పీసీని సీల్డ్‌కవర్‌లో ఉం చి కమిషన్‌కు సమర్పించారు. నాలుగేళ్లగా ఆమెకు రావాల్సిన వేతనాన్ని ఈ నెల 12వ తేదీలోగా చెల్లించి, తమకు సమగ్రమైన నివేదికను అందజేయాలని ప్రభుత్వాన్ని సోమవారం కమిషన్ ఛైర్మన్ సుభాషణ్‌రెడ్డి ఆదేశించారు.

Labels: ,

పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నతుమ్మ

ఢిల్లీలో పర్యావరణ పరిరక్షణ కోసం రోడ్డు వెంట నాటిన 'తుమ్మ (ప్రొసోపిస్ జులిఫ్లోరా)' మొక్కలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించిన ఈ మొక్కలను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢి ల్లీలో 7,777మొక్క లు నాటారని, ఇవి పెరుగుతున్న ప్రాంతంలో ఇతర వృక్షజాతులు మనుగడ సాగించడం లేదని సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డీగ్రేడెడ్ ఎకోసిస్టమ్స్(సీఈఎండీఈ)కి చెందిన ప్రొఫెసర్ సీఆర్ బాబు వెల్లడించారు. ' చెట్ల వేర్లు దాదాపు 21మీటర్ల లోతు మేరకు భూమిలోకి చొచ్చుకుపోతాయి. ఫలితంగా వర్షపు నీరు లోపలికి వెళ్లడం సాధ్యం కాదు. ఈ మొక్క సమీపంలోని నేలలో భూసారం, తేమ తగ్గుతుంది'అని అంటారాయన. వీటి ఆకుల్లో ఒక రకమైన రసాయనం ఉండడం వల్ల అవి మండే స్వభావం కలిగి ఉండడంతో పాటు త్వరగా కుళ్లిపోయే అవకాశముండదని నిపుణులు చెబుతున్నారు. తుమ్మ వల్ల కలిగే హాని గురిం చి తెలుసుకోవడానికి గుజరాత్ పర్యావరణ శాఖ కచ్ ప్రాంతంలో నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈజాతికి చెందిన మొక్కలు ఎదుగుతున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం, ఉపాధి తీవ్రంగా దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. తుమ్మ మొక్కలు దట్టంగా ఉండి అధికభాగాన్ని ఆక్రమించడం వల్ల నేలపై వెలుతురు ప్రసరించే వీలుండడం లేదని కనుగొన్నారు. తుమ్మ మొక్కలు నాటిన తరువాత కచ్ ప్రాంతంలో ఒక పక్షి కూడా కనపడలేదంటే వీటి ప్రభావం ఎలా ఉంటుం దో సులభంగానే గ్రహించవచ్చు. వీటిని తినడం వల్ల అక్కడ భారీ సంఖ్యలో పశువులు మరణించాయి. ప్రభుత్వం ఏమంటోంది ? ఈ విషయమై పర్యావరణశాఖ సీనియర్ సైంటిఫిక్ అధికారి డాక్టర్ బీ.సీ. సబత్ స్పందిస్తూ ఈమొక్కలను ధ్వంసం చేసి వీటి స్థానంలో కొత్తవి నాటడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు.

Labels: , ,

20071105

ఇఎంఆర్‌ఐ సర్వీసు లకు మరో 122 అంబులెన్స్‌లు

సత్యం ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఇఎంఆర్‌ఐ సర్వీసు లకు ఈ యేడాది అదనంగా మరో 122 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చనుందని, ఈ యేడాది ఇఎంఆర్‌ఐ, హెచ్‌ఆర్‌ఎంఐ సర్వీసులకోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద 32 కోట్లరూపాయలను కేటాయించనున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి సంభాని చంద్రశేఖర్‌ చెప్పారు. ఇఎంఆర్‌ఐ,హెచ్‌ఎంఆర్‌ఐ సర్వీసుల నిర్వహణకోసం 95శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చడానకి అవగాహన ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, సత్యం ఫౌండేషన్‌ ప్రతినిధుల తరుపున సచివాలయంలో సంతకాలు జరిగాయిం. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆరోగ్యసమాచార సర్వీసులకు సంబంధించి సత్యం ఫౌండే షన్‌ వద్ద ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 380 అంబులెన్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యంఫౌండేషన్‌ ప్రతినిధి డాక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్న మూడు జిల్లాల్లో ఆరోగ్య సమాచార సర్వీసులను అందిస్తున్నామని చెప్పారు. ఇఎంఆర్‌, హెచ్‌ఎంఆర్‌ఐ లోగోల స్థానంలో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ లోగోలను ఇక మీదట ఉపయోగించనున్నట్లు మంత్రి చెప్పారు.

Labels: , , ,

ఎటిఎంలు ఇకపై రైళ్లలో

ఎటిఎంలు రైళ్లలో కూడా ఏర్పాటుకాబోతున్నాయి. ఖాతా దారులు రైళ్లల్లో ఏర్పాటు చేయబోతున్న ఎటిఎంల నుంచి డబ్బు డ్రా చేసు కునే సౌలభ్యం పొందబోతున్నారు. ఎం పిక చేసిన రైళ్లల్లో ఎటిఎంలను నెలకొ ల్పడానికి రైల్వేలు ప్రణాళికలు రూపొం దిస్తున్నాయి. పైలెట్‌ ప్రాజెక్టు కింద కొన్ని రైళ్లల్లో ఎటిఎంలను ఏర్పాటు చేయడా నికి సన్నాహాలు చేస్తున్నారు.

Labels: , ,

20071104

సమస్యలను పట్టించుకోని సెల్‌ఫోన్ సంస్థలు

సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఇండియా మొబైల్ సర్వీసెస్ (ఐబీఎస్) సర్వే నిర్వహించి తేల్చింది. సెల్‌ఫోన్ సంస్థలు వినియోగదారుల కోసం రూపొందించే కస్టమర్ కేర్ సర్వీస్ (సీసీఎస్) కేంద్రాలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని పెదవి విరిచింది.
సర్వే అధ్యయన ప్రధానాంశాలివి.
* వినియోగదారులు తమ ఫిర్యాదులపై సీసీఎస్ నుంచి సంతృప్తికర సమాధానం పొందాలంటే కనీసం ఆరు నిమిషాలు పడుతోంది.
* దేశంలో 11 సెల్ సంస్థలున్నా, వినియోగదారులకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చే వాటిని వేళ్లమీద లెక్కబెట్టవచ్చు.
* టెలిఫోన్ రెగ్యులేట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల సేవలకు సంబంధించి అనేక విధివిధానాలు